బాధితులకు భరోసా కల్పించాలి:సిపి అంబర్ కిషోర్ ఝా

పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసా కల్పిస్తూ, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వర్తించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా సూచించారు.వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం మంచిర్యాల జోన్‌ పరిధిలోని హాజీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌కు పోలీస్‌ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సిపి పోలీస్‌ సిబ్బందితో మాట్లాడి వారి విధులు, పనితీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా స్టేషన్‌ రిసెప్షన్‌, […]