రాపల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి దిశగా మరో ముఖ్యమైన అడుగు పడింది. రాపల్లి స్టేజ్ నుండి R&R కాలనీ వరకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వీధి దీపాల లైన్ గత 5–6 సంవత్సరాలుగా పునరుద్ధరణ లేక నిర్లక్ష్యానికి గురై దయనీయ స్థితిలో ఉండేది. దీనివల్ల గ్రామ ప్రజలు రాత్రివేళల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు.

ఈ సమస్యను గుర్తించిన రాపల్లి గ్రామ సర్పంచ్ మిట్టపల్లి రాంరెడ్డి , ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టారు. ఉగాది పర్వదినం (పరాభవ నామ సంవత్సరం)ను పురస్కరించుకొని, ఈ రోజు ఆ వీధి దీపాల లైన్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం గ్రామంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఈ సందర్భంగా సర్పంచ్ గారు గ్రామ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాపల్లి ఉపసర్పంచ్ తంగెళ్ల సాగర్ , వార్డు సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ సర్పంచ్ కి కృతజ్ఞతలు తెలిపారు.
Recent Post:-
పురపాలన ప్రజలకు చేరువ కావాలి: కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్
Workout Routine for Men: Complete Weekly Gym Plan for Strength and Fitness











Leave a Reply