Navataram

Real news Real time

కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే చెల్లించాలి

mla diwakar rao

*త్వరగా వైద్య కళాశాలను అందుబాటులోకి తేవాలి

మెడికల్ కాలేజీ,ఆసుపత్రి భవన నిర్మాణ కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే చెల్లించాలి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు.గుడిపేట్ లో నిర్మితమవుతున్న మెడికల్ కాలేజీ నీ మంగళవారం స్థానిక బీ అర్ ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉంచేందుకు మాజీ సీ ఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ మంజూరు చేశారన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు ఇవ్వకపోయినా అప్పటి రాష్ట్ర బడ్జెట్ నుంచే కాలేజీలు,ఆసుపత్రుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మొదటి విడతలోనే అప్పటి మంత్రి హరీష్ రావు చొరవతో జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరయిందని, గుడిపేట్ శివారులో 32 ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.510 కోట్లతో ఈ కాలేజీ,450 పడకల ఆసుపత్రి భవనాలు నిర్మాణం ప్రారంభము అయ్యి ప్రస్తుతం పూర్తయ్యేదశకు వచ్చిందన్నారు.

కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో ఆలస్యం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో ఆలస్యం జరుగుతుందన్నారు.కేసీఆర్ సంకల్పంతో, తమ కృషితో నిర్మాణం మొదలైన కళాశాల చరిత్రలో లిఖించబడుతుందన్నారు.ఇప్పటికే జిల్లాలో మెడికల్ కాలేజీ విద్యార్థులకు 4 సంవత్సరాల విద్య పూర్తయిందని.త్వరలో సొంత భవనంలో ,విద్యార్థిని,విద్యార్థులకు వేరు వేరు హాస్టల్స్ తో ఇక్కడ తరగతులు ప్రారంభం అవడం ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.కేసీఆర్ విద్యా,వైద్యం,సంక్షేమం కోసం పాటుబడిన పనులు,ఫలాలు ఇప్పుడు ప్రజలకు అందనున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ బేర పద్మ పోచయ్య,మందపల్లి శ్రీనివాస్,మొగిలి శ్రీనివాస్, గోళ్ళ శ్రీనివాస్,మంచాల శ్రీనివాస్, అత్తె సరోజన, అత్తె తిరుపతి,మల్లేష్,ధరణి రాంబాబు,లగిశెట్టి సాయి,మురళి లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *