సమిశ్రగూడెం ఎంపీడీవో కార్యాలయంలో నిడదవోలు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంభించిన మంత్రి దుర్గేష్

ప్రణాళికాబద్ధంగా నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.సోమవారం వేదమంత్రోచ్ఛరణల మధ్య మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా నిడదవోలు మండలం సమిశ్ర గూడెం ఎంపీడీవో ఆఫీస్ లో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అధ్యక్షుడుగా మంత్రి కందుల దుర్గేష్ వ్యవహరించనున్నారు.డిప్యూటి కలెక్టర్ స్థాయి ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ప్రణాళికా విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నియోజకవర్గ అభివృద్ధిపై నియమింపబడిన ఒక యంగ్ ప్రొఫెషనల్, గ్రామ సచివాలయాల నుండి ప్రత్యేకంగా ఎంపిక చేయబడ్డ 5 మంది ఉద్యోగులు వ్యవసాయం, ఆక్వా మరియు లైవ్ స్టాక్, పారిశ్రామిక, సేవారంగాలతో పాటు రియల్ టైం గవర్నెన్స్, పీ4 మరియు పబ్లిక్ ఇంటర్ఫేస్ కోఆర్డినేటర్లుగా పనిచేయనున్నారు.నియోజకవర్గ స్థాయి అభివృద్ధి ప్రణాళికల అమలుకు, సమన్వయానికి ఈ సీవీఏపీ యూనిట్ కీలక పాత్ర పోషించనుందని టీమ్ కి తెలుపుతూ పలు సూచనలు చేశారు.
అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి, నియోజకవర్గ అభివృద్ధిపై అధ్యయనం చేసి అమలు చేసేందుకు ఇదొక చక్కని వేదికగా ఉపకరిస్తుందన్నారు. రాష్ట్రంలోని నియోజకవర్గాలకు ఇదొక నమూనాగా మారాలని టీమ్ కు సూచించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ అమలు లక్ష్యంగా పనిచేద్దామన్నారు.పీ4 లో భాగంగా రాష్ట్రంలో పేదరికం లేకుండా, అధిక ఆదాయం కలిగిన హెల్తీ, హ్యాపీ సమాజం లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి, నీటి భద్రత, లాజిస్టిక్స్, బ్రాండింగ్, డీప్ టెక్, పర్యావరణ పరిరక్షణ తదితర 10 ప్రధాన సూత్రాలు అమలు చేయాలని సూచించారు. పీ4ను విజయవంతంగా అమలు చేయాలన్నారు.బంగారు కుటుంబాలను, మార్గదర్శకులను వేగవంతంగా గుర్తించి పేదరికం లేని సమాజానికి బాటలు వేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు చెందిన ఎంపిడివోలు, ఎంఆర్వోలు, ఎంపిటిసి, జెడ్పిటిసి సభ్యులు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.











Leave a Reply