కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

శనివారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి సమక్షంలో, మాజీ జడ్పీటీసీ కలం, కేరిమెరి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రాథోడ్ అంబాజీ ఆధ్వర్యంలో కేరిమెరి మండలంలోని అనార్పల్లి, తుమ్మగూడ, సొమ్లగూడ, కొలం గూడ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు అనుచరులు కలిపి సుమారు 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వీరికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సభ్యత్వం అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ –
“ఇవాళ అధికార కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీ విధానాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా చేరుతున్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు లంబాడీ తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి అభివృద్ధికి పునాది వేశారు.
కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలకు రూపాయి నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటోంది.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వర్గాన్ని నిరాశపరిచింది,” అన్నారు.
“రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెబుతారు. మరో రెండేళ్లలో కాంగ్రెస్ గద్దె దిగి రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది,” అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మర్సకోలా సరస్వతి, రూపులాల్, యూనిస్, పరుశురాం నాయక్, కృష్ణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply