పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు శ్రీ వంశీ కృష్ణ
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని శివలింగాపూర్ గ్రామంలో సత్వ ప్రకృతి వైద్య ఆసుపత్రి ఘనంగా ప్రారంభమైంది. ఈ ఆసుపత్రిని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వంశీ కృష్ణ శనివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీ కృష్ణకు ఆసుపత్రి యాజమాన్యం పుష్పగుచ్చం అందించి, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రజలు, వైద్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ వంశీ కృష్ణ గారు చెప్పారు
“నేటి కాలంలో ప్రకృతి వైద్యం అందించడం చాలా గొప్ప విషయం. ఇప్పటి రోజుల్లో మనం నేచురల్ లైఫ్‌స్టైల్ నుంచి దూరమవుతున్నాం. ఆహారం నుండి ఔషధాల వరకు అన్నింటిలోనూ కెమికల్స్ వాడకం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి వైద్యం ఒక వరం లాంటిది. ఈ ఆసుపత్రి స్థాపకులు తీసుకున్న ఈ సత్కార్యం ప్రశంసనీయమైనది,” అని అన్నారు.
“మన చెన్నూర్ ప్రాంతంలో ఇలాంటి వైద్య సేవలు అందించడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆసుపత్రి ద్వారా ప్రకృతికి అనుగుణమైన వైద్యం అందించడం, ప్రజలలో సహజమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం ఎంతో అవసరం. ఆరోగ్యం అనేది మన జీవితానికి మూలం. ఔషధాల మీద ఆధారపడకుండా ప్రకృతిలో లభ్యమయ్యే పద్ధతుల ద్వారా రోగాల నివారణ చేయడం ఒక ఉత్తమ మార్గం,” అని చెప్పారు.

వంశీ కృష్ణ సత్వ ఆసుపత్రి స్థాపకులకు అభినందనలు తెలుపుతూ, “ఇంతమంచి ప్రకృతి ఆసుపత్రి మన ప్రాంతంలో స్థాపించడం గర్వకారణం. ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందాలని, మరింత మంది ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కోరుకుంటున్నాను. ఇక్కడి వైద్యులు, నేచురోపతి నిపుణులు నేచరల్ థెరపీ, యోగా, డైట్ కౌన్సిలింగ్, హర్బల్ చికిత్స వంటి సేవలతో ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తారని నమ్ముతున్నాను,” అని అన్నారు.
ఆసుపత్రి యాజమాన్యం తెలిపిన ప్రకారం, సత్వ ప్రకృతి వైద్య ఆసుపత్రిలో ఆధునిక సదుపాయాలతో పాటు పూర్తిగా ప్రకృతి ఆధారిత చికిత్సా విధానాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రాణాయామం, ధ్యానం, యోగా, నేచురల్ డిటాక్స్ వంటి కార్యక్రమాల ద్వారా శరీరం, మనసు రెండూ ఆరోగ్యంగా ఉండేలా సేవలు అందించనున్నామని తెలిపారు.
కార్యక్రమంలో చెన్నూర్ మండల ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. సమాజంలో ఆరోగ్య అవగాహన పెంచడమే తమ లక్ష్యమని, రాబోయే రోజుల్లో ఈ ఆసుపత్రి ప్రజలకు సహజ వైద్యానికి ఒక ఆదర్శ కేంద్రంగా నిలుస్తుందని యాజమాన్యం తెలిపింది.
సత్వ ప్రకృతి వైద్య ఆసుపత్రి ప్రారంభం ద్వారా చెన్నూర్ మండలం ఆరోగ్య రంగంలో ఒక కొత్త దిశగా అడుగుపెట్టినట్లు ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రకృతిలోనే ఆరోగ్యం దాగి ఉందనే సూత్రంతో ఈ ఆసుపత్రి ప్రజల సేవలో ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.











Leave a Reply