భారత దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన “లోహ పురుషుడు” శ్రీ సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం)ను పురస్కరించుకొని సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివస్ 2కె రన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక 2కె రన్ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 31, 2025 న ఉదయం 7 గంటలకు హాజీపూర్ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమై రాంపూర్, పడ్తన్ పల్లి గ్రామంలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం స్కూల్ గ్రౌండ్ వద్ద ముగియనుంది.

రాష్ట్రీయ ఏకతా దినోత్సవం ప్రతి భారతీయుడు దేశ సమైక్యత, భౌగోళిక సమగ్రత, జాతి ఐక్యత పట్ల అంకితభావంతో ఉండాలని గుర్తు చేస్తుంది. సర్దార్ వల్లభభాయ్ పటేల్ భారత రాజ్య సమైక్యతకు మూలస్థంభంగా నిలిచారని, ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏడాది అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా రాష్ట్రీయ ఏకతా దినోత్సవాన్ని జరుపుకుంటామని పేర్కొన్నారు.
ఈ 2కె రన్ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, యువత, మీడియా మిత్రులు, అన్ని శాఖల అధికారులు, క్రీడారంగ ప్రముఖులు మరియు ప్రజలందరూ పాల్గొని ఐక్యతా సందేశాన్ని విస్తృతంగా చాటాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం ద్వారా సమాజంలో ఆరోగ్య చైతన్యం, జాతీయ ఏకతా భావన, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించడమే ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి పోలీస్ శాఖతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యా సంస్థలు, క్రీడా సంఘాలు చురుకైన భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. “ఒక్క భారత్ – శ్రేష్ఠ భారత్” అనే నినాదంతో నిర్వహించబడుతున్న ఈ 2కె రన్ కార్యక్రమం ద్వారా సర్దార్ పటేల్ గారి ఆదర్శాలను తరతరాలకు చాటి చెప్పే ప్రయత్నం జరుగుతోంది.











Leave a Reply