ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
ఏలూరు రెడ్ క్రాస్ సంస్థ భవనంలో రెండవ అంతస్తు నిర్మాణ పనులకు గత నెల 28న శంకుస్థాపన చేసిన సందర్భంగా తన తల్లి విజయలక్షి పేరుతోని ట్రస్టు తరపున రెడ్ క్రాస్ సంస్థకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 2 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. లాభాపేక్ష లేకుండా సమాజానికి సేవ చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీకి అందరూ అండగా నివాల్సిన అవసరం ఉందని చెబుతూ సభా వేదికగా 2 లక్షల విరాళం ప్రకటించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇచ్చిన మాట 10 రోజుల్లోనే నిలబెట్టుకున్నారు.

తాజాగా 2 లక్షల విరాళం చెక్కును ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తరపున ఆయన కార్యాలయ ప్రతినిధులు మంగళవారం రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో ఆ సంస్థ ఏలూరు విభాగం ఛైర్మన్ ఎంబిఎస్వీ ప్రసాద్ కు అందించారు. రోగులకు అవసరమైన రక్త సేకరణలో, ప్రకృతి విపత్తుల సమయంలో రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం ఉదార హృదయం, సేవా భావంతో తమ సంస్థకు 2 లక్షల ఆర్ధిక సహాయం అందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ ఎంబిఎస్వీ ప్రసాద్, వైస్ ఛైర్మన్ సత్యనారాయణరాజు, ట్రెజరర్ బ్రహ్మానందం, సభ్యులు అజయ్ బాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Recent post:-
ఉచిత గాలి కుంటు వ్యాధి టీకాల కార్యక్రమం ప్రారంభం
The Complete Guide to Fiber Enriched Food for a Healthier Life










Leave a Reply