సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరి సురేందర్ గారి భార్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే మంత్రి సవిత ఆదివారం గోరంట్ల గ్రామానికి వెళ్లి సురేందర్ గారి కుటుంబాన్ని ఆత్మీయంగా పరామర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతి వ్యక్తం చేశారు. బాధ సమయంలో ధైర్యంగా ఉండాలని ప్రోత్సహిస్తూ, “విలేకరులు సమాజానికి అద్దం పట్టే వృత్తిజీవులు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే బాధ్యత జర్నలిస్టులదే. ఇలాంటి కుటుంబాలు కష్టాల్లో ఉన్నప్పుడు మనందరం అండగా నిలవాలి” అని మంత్రి సవిత పేర్కొన్నారు.
ఆమె సురేందర్ గారికి ధైర్యం చెబుతూ, కుటుంబానికి అవసరమైన సహాయం అందించే విషయంలో తన మద్దతు ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. స్థానికులు ఎమ్మెల్యే సవిత గారు చూపిన మానవీయతను అభినందించారు.










Leave a Reply