డాక్టర్ భాస్కర్ మాదేకర్ ఉదార నేత్ర వైద్యశాల రేకుర్తి, కరీంనగర్ వారి సౌజన్యంతో, 68 నిరుపేదల నేత్ర జ్యోతి చెన్నూర్ లయన్స్ క్లబ్వైస్ చైర్మన్ చిదుర సురేష్ గారి సహకారంతో చెన్నూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం తేది.24.10.2025 శుక్రవారం నాడు, పడమటింటి కృష్ణమూర్తి కాంప్లెక్స్ లో నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ శిబిరానికి 102 మంది హాజరై తమ పేరు నమోదు నమోదు చేసి బీపీ,షుగర్, కంటి పరీక్షల అనంతరం 85 మంది అర్హత సాధించినట్లుగా రేకుర్తి ప్రతినిధి ప్రభాకర్ ప్రకటించగా రెండు విడతల్లో మొత్తం 68 నిరుపేదల నేత్ర జ్యోతి చెన్నూర్ లయన్స్ క్లబ్ఆ పరేషన్లు విజయవంతమైనట్లు చెన్నూరు లైన్స్ క్లబ్ అధ్యక్షులు జాడి తిరుపతి తెలిపారు.

చెన్నూర్ లయన్స్ అధ్యక్షులు జాడి తిరుపతి
నేడు మైనారిటీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన రిసీవింగ్ ప్రోగ్రాం సమావేశంలో చెన్నూర్ లయన్స్ అధ్యక్షులు జాడి తిరుపతి పేషెంట్లను ఉద్దేశించి మాట్లాడుతూ రేకుర్తి డాక్టర్ల సూచన మేరకు మందులు వాడుతూ కంటిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. నవంబర్ నాలుగవ తారీఖు నాడు తప్పకుండా రేకుర్తికి వెళ్లి వారి సూచన మేరకు నడుచుకోమని తెలిపారు. ఐ పేషెంట్లకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది. చెన్నూరు లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రోత్సహించవలసిందిగా తెలియజేస్తూ,వచ్చే నెల నవంబర్ 18 తారీఖు నాడు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఉంటుందని, చెన్నూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరారు.
పండ్ల దాత:-
పండ్ల దాత లయన్ బెల్లంపల్లి నాగరాజ గౌడ్ గారి సోదరి రాధికాదేవి గారి పుట్టినరోజు సందర్భంగా గొప్ప మనస్సుతో ఐ పేషెంట్లకు పండ్లను పంపిణీ చేసినందుకు వారికి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జోన్ చైర్ పర్సన్ లయన్ మోదుంపురం వెంకటేశ్వర్, కార్యదర్శి లయన్ సౌడం శ్రీనివాస్, కోశాధికారి లయన్ నిమ్మల సాగర్, లయన్ బెల్లంపల్లి నాగరాజాగౌడ్, లయన్ జక్కుల సత్యనారాయణ వారి వెంట వెళ్లి వచ్చిన వాలంటీర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.,











Leave a Reply