Navataram

Real news Real time

అప్పుల భారంతో రైతు మృతి: బాధిత కుటుంబానికి వ్యవసాయ కమిషన్ మద్దతు

వ్యవసాయ కమిషన్ సభ్యులు భూమి సునీల్ తండ్రి గారైన మేక సంజీవ రెడ్డి ద్వితియ వర్థంతిని పురష్కరించుకొని వారి జ్ఞాపకార్థం ప్రతి యేటా ఒక రైతు కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకొని అందులో భాగంగా ఈ రోజు మలుగు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న గిరిజన కౌలు రైతు కుటుంబానికి తెలంగాణ వ్యవసాయ సంక్షేమ కమీషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారి చేతుల మీదుగా 25 వేల రూపాయల రైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. రైతు కుటుంబానికి ఆర్థిక సాయం . తార్నకాలోని లీఫ్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన కమిషన్ సభ్యులు కెవిన్ రెడ్డి, రాములు నాయక్, గోపాల్ రెడ్డి ఆ కుటుంబానికి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని దీనికి అదనంగా మరో 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. కమీషన్ సభ్యురాలు భవాని రెడ్డి ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సంధర్బంగా ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యంగా ఉంటూ వారి కుటుంబంలోని పిల్లల్ని బాగా చదివించాలని.. అందుకు తగ్గ సాయం అందిస్తామని పేర్కొన్నారు. రైతు కుటుంబానికి ఆర్థిక సాయం.

ములుగు జిల్లా, దేవగిరి పట్నం గ్రామానికి చెందిన గిరిజన రైతు నాగవత రాజు (40) 8 ఎకరాల భూమిని కౌలు తీసుకుని పత్తి, వరి సాగు చేశాడు. వరుసగా మూడు సంవత్సరాలు పంట నష్టం రావటంతో రూ.5 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక 23-01-2020న పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య లావణ్య కూలి పనులు, కుట్టు మిషన్‌తో పోషిస్తోంది. పెద్ద కుమార్తె తేజశ్రీ మానసిక వికలాంగురాలు కాగా, చిన్న కుమార్తె అంజలి, కుమారుడు జస్వంత ఆర్థ ఉన్నారు. రైతు కుటుంబానికి ఆర్థిక సాయం.

Recent Post:-

మున్సిపల్ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి

Ketoconazole Shampoos Explained: Uses, Benefits, and How to Choose the Right One

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *