Navataram

Real news Real time

బాల్క సుమన్ అరెస్ట్‌పై కాసిపేటలో బిఆర్ఎస్ ఆందోళనలు

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా పనిచేసిన బాల్క సుమన్ అరెస్ట్‌ను నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో కాసిపేట మండలంలో ఆందోళనలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి బాల్క సుమన్‌ను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపు మేరకు కొండాపూర్ యాప్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును బిఆర్ఎస్ గౌరవిస్తుందని తెలిపారు. అయితే ఆ తీర్పును జీర్ణించుకోలేక చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి వివేక్ వెంకటస్వామి అక్రమ కేసులు పెట్టించి అరెస్ట్ చేయించారని ఆరోపించారు.

క్యాతనపల్లిలో బిఆర్ఎస్‌కు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ, కాంగ్రెస్ నేతలు అక్రమాలు మరియు అరాచకాలకు పాల్పడుతూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, చివరకు ప్రజలే తుది తీర్పు ఇస్తారని పేర్కొన్నారు.

అధికారంలో ఉన్నవారు రాజ్యాంగబద్ధమైన విధానాలను పాటించాలని, అధికారమేది శాశ్వతం కాదని బిఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. రానున్న కాలంలో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని, మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బాల్క సుమన్‌పై నమోదైన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Recent Post:-

పెద్దంపేట గ్రామంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధి నివారణ శిభిరం

Top 12 Foods That Are High in Vitamin B12

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *