గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు పరిపాలన సాగించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్లా లో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో నూతన సర్పంచ్ లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తూ పంచాయత వ్యవస్థను మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని తెలిపారు.

గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం గ్రామస్థాయిలో ప్రజల ఆశయాలను నెరవేర్చే బాధ్యత సర్పంచ్ లదే అని, ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వ్యవస్థ, పాలన విధానాలు, నిబంధనలు, నిర్వహణ అంశాలలో పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండడం అవసరమని తెలిపారు. శిక్షణలో గ్రామ పంచాయతీ విధులు, అధికారాలు, గ్రామ అభివృద్ధి ప్రణాళిక తయారీ విధానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు – అమలు విధానం, ఆర్థిక నిర్వహణ, బడ్జెట్ తయారీ, ఖాతాల నిర్వహణ, గ్రామ పంచాయతీ రికార్డులు, రిజిస్టర్లు, డిజిటల్ సర్వీసులు, ప్రజాసేవలో పారదర్శకత, బాధ్య, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, సమానత్వం, స్వచ్ఛ భారత్, హరిత హారం, పరిశుభ్రత కార్యక్రమాలు, ప్రజలతో సంబంధాలు – వినతులు, ఫిర్యాదుల పరిష్కారం, గ్రామస్థాయిలో నాయకత్వ లక్షణాలు వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం గ్రామస్థాయిలో పరిపాలన సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన నైపుణ్యం, జ్ఞానం అందించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ పాలనలో నూతన దృక్పథంతో ముందుకు సాగేందుకు శిక్షణ తోడ్పడుతుందని, సంబంధిత మండలాలకు చెందిన సర్పంచ్ లు నిర్ణీత తేదీ, సమయం, స్థలం లో తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు. గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం శిక్షణ కార్యక్రమం గ్రామాభివృద్ధికి అత్యంత కీలకమైనదని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను అమలు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్, చెన్నూర్, హాజీపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మోహన్, సాయి వెంకట రెడ్డి, మండల పంచాయతీ అధికారులు శ్రీపతి బాపురావు, అనిల్, శ్రీనివాస్, పి. వెంకటేష్, మహేష్, పంచాయితీ కార్యదర్శులు, డి. పి. ఎం. సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply