-2025 నవంబర్ 1 నాటికే తీవ్ర పేదరిక నిర్మూ చేసిన కమ్యూనిస్టు ప్రభుత్వం.
ప్రజా పాలన అంటే ఏమిటో ఆచరణలో చూపించిన కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం.
మంచిర్యాల కలెక్టరేట్ వద్ద ఈ రోజు కేరళలో కొనసాగుతున్న కమ్యూనిస్టు పాలన విజయాల గురించి ప్రజలకు వివరిస్తున్న సంకె రవి సీపీఎం జిల్లా కార్యదర్శి.ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న కేరళ అభివృద్ధి ఉన్నది.
కేరళలో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎల్ డి ఎఫ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్నే గీటురాయిగా పరిపాలన కొనసాగించడం జరుగుతుంది.రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందించడంలో విశేషమైనటువంటి కృషి కేరళ ప్రభుత్వం చేయడం జరిగింది.
100% అక్షరాస్యత,ఆహార పదార్థాల కల్తీ నివారణ, ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్య,ప్రభుత్వ వైద్యం అందరికీ అందించడం,కనీస వేతనాలు అమలు జరపడం,పేదలకు గృహ వసతి ప్రభుత్వమే కల్పించడం,రేషన్ షాపుల ద్వారా 14 రకాల సరుకులను లబ్ధిదారులకు అందించడం,అధికారంలో ఉన్నవాళ్లు ప్రజలకు అందుబాటులో ఎలా ఉండాలో ఆచరణలో చూపించిన కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం. దేశంలో 28 రాష్ట్రాలు ఉండగా ఒక కేరళ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పాలన కొనసాగుతుందని కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా నిజాయితీగ చెప్పుతున్న స్థితి ఈరోజు ఉన్నది.

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా
2021లో తీవ్ర పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు చేసి 64 వేల కుటుంబాలను గుర్తించడం జరిగింది.తీవ్ర పేదరికంలో మగ్గుతున్న వాళ్లందర్నీ 2025 నవంబర్ 1 నాటికి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే పని ప్రభుత్వం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.అనుకున్న విధంగానే 64 వేల కుటుంబాలకు ప్రభుత్వమే ఇండ్లు కట్టించి ఇవ్వడం, ఉపాధి చూపించడం,విద్య, వైద్యం సౌకర్యాలు కల్పించడం,రుణాలు ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి చేసే కృషి చేయడం జరిగింది. దీని ఫలితంగా నేడు తీవ్ర పేదరిక నిర్మూల లక్ష్యాన్ని పెట్టుకున్న ప్రభుత్వం దాన్ని నిర్మూలించి దేశానికి, ప్రపంచానికే ప్రజాపాలన ఎలా చేయాలో సాగలో ఆచరణలో చూపించడం జరిగింది.
పేదవాళ్ల కడుపున మార్చడం
కమ్యూనిస్టు పార్టీ పరిపాలనలోనే ప్రజా సంక్షేమం,అభివృద్ధి కొనసాగుతుంది.ఇతర బుర్జవా పార్టీలు అధికారంలో ఉన్న కాడ ధనవంతుల బొజ్జలు నింపడం,పేదవాళ్ల కడుపున మార్చడం కొనసాగుతుంది.
ప్రజలకు సౌకర్యాలు కల్పించబడాలంటే కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి రావలసిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు కేరళ అనుభవాలు తెలియజేస్తున్నాయి.ప్రజలు కమ్యూనిస్టు పాలనవైపు ఆలోచనలు చేయవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది అంటూ ఈ కార్యక్రమంలో ఏర్మ పున్నం,అభినవ్,అర్షవర్దన్ ప్రజలు పాల్గొన్నారు











Leave a Reply