జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మూడు సంవత్సరాల బాబు అయూబ్‌తో పాటు ఒక ప్రసూతి మహిళ మరియు సతీష్ కుమార్ దవాఖానలో చికిత్స పొందుతున్న రోగికి అత్యవసర సమయంలో రక్తం, ప్లేట్లెట్స్ అవసరం ఏర్పడింది. ఆ సమయంలో రక్తబ్యాంక్‌లో ప్లేట్లెట్స్ కొరత ఉన్నప్పటికీ, కొందరు నిస్వార్థ రక్తదాతలు ముందుకు వచ్చి తమ రక్తాన్ని దానం చేసి ప్రాణాలను కాపాడారు.

ఈ మానవతా సేవలో జగిత్యాల టౌన్ క్రైం కానిస్టేబుల్ జీవన్‌తో పాటు చల్గల్ గ్రామానికి చెందిన బాబుజని, జగిత్యాల నూకపెల్లికి చెందిన మహేష్, శివ, రాయికల్‌కు చెందిన సతీష్ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితిలో ఎలాంటి సంకోచం లేకుండా స్పందించిన వీరి సేవ అభినందనీయం.
రక్తదాతలు ఈ సందర్భంగా మాట్లాడుతూ, రక్తదానం చేయడం ద్వారా ఒకరి ప్రాణాలను కాపాడటం ఎంతో గొప్ప సేవ అని అన్నారు. ఇది మానవత్వానికి నిదర్శనమని, ప్రతి ఆరోగ్యవంతుడు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అయితే నేటి సమాజంలో రక్తదాతలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకే కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయని, అలాంటి సమయంలో తాము స్వచ్ఛందంగా సేవ చేస్తున్నప్పటికీ ఎవరు గుర్తించకపోవడం బాధాకరమని తెలిపారు. అయినప్పటికీ తమ సేవను ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా అది ఒక దైవప్రాప్తిగా భావిస్తూ కొనసాగిస్తామని చెప్పారు.
ఇలాంటి నిస్వార్థ సేవలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, రక్తదానం ద్వారా అనేక ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు పేర్కొన్నారు. ప్రజలు రక్తదానం పట్ల అవగాహన పెంచుకుని ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు.
Recent Post:-
గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పరిపాలన సాగించాలి











Leave a Reply