గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని హాజీపూర్ మండలం పెద్దంపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని కొలాంగూడ గ్రామంలో మండల ప్రభుత్వ ఉద్యోగులచే సేకరించిన దుప్పట్ల పంపిణీగిరిజనుల సంక్షేమం, అభివృద్ధి పై ప్రత్యేక చర్యలు కార్యక్రమానికి హాజరై గిరిజన కుటుంబాలకు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం చలి తీవ్రత మరింత అధికంగా ఉన్నందున చలి ప్రభావిత ప్రాంతాలలో ప్రజల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, హాజీపూర్ మండలం ప్రభుత్వ ఉద్యోగులు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని తెలిపారు.

గ్రామంలోని 40 కుటుంబాల వారికి దుప్పట్లు అందజేయడం జరిగిందని, చలి తీవ్రత అధికంగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లాలో పి.వి.టి.జి. లకు 200కు పైగా ఇండ్లు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇంటి స్థలం కలిగి ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందని తెలిపారు.
ఇంటి నిర్మాణానికి ఇసుకను ఉచితం
ఇంటి నిర్మాణానికి ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని, లబ్ధిదారులు వినియోగించుకోవాలని తెలిపారు. గిరిజన పిల్లలు చదువుకునేందుకు పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గిరిజన ప్రాంతాలలో అంతర్గత రహదారులు, త్రాగునీటి సమస్య లేకుండా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎస్సై తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply