Navataram

Real news Real time

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో అంజలీదేవి ముత్తెకు మద్దతు

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రముఖ హైకోర్టు న్యాయవాది అంజలీదేవి ముత్తె ని గెలిపించుకుందామని పిలుపు ఇచ్చిన రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్.

ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులలో విశేష ఆసక్తిని రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న హైకోర్టు న్యాయవాది, కుల బంధువు ముత్తే అంజలి తన భర్త, ప్రముఖ న్యాయవాది ముత్తే తిరుపతి వర్మ తో కలిసి ఈరోజు ఖైరతాబాద్‌లోని పెరిక హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పెరిక కుల సంఘానికి చెందిన పెద్దలు, నాయకులు, న్యాయవాదులను కలుసుకుని ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని వినమ్రంగా అభ్యర్థించారు.

సమావేశంలో మాట్లాడిన ముత్తే అంజలి , తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 250 మంది అడ్వకేట్లు బార్ కౌన్సిల్ మెంబర్స్‌గా ఉన్నారని తెలిపారు. న్యాయవృత్తిలో నైతిక విలువలు, పారదర్శకత, యువ న్యాయవాదుల సమస్యల పరిష్కారం, మహిళా న్యాయవాదుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై తాను ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని చెప్పారు. బార్ కౌన్సిల్ ఎన్నికలు వ్యక్తిగత విజయం కోసం కాకుండా, న్యాయవాదుల సంక్షేమం కోసం జరిగే ప్రజాస్వామ్య ప్రక్రియ అని పేర్కొన్నారు. అందుకే పెరిక కుల సంఘం తరఫున బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తమకు ఉన్న సభ్యులు తనకు ఓటు వేయాలని పిలుపునివ్వాలని కోరారు.

ఈ సమావేశానికి హాజరైన గౌరవాధ్యక్షుడు మద్ద లింగయ్య మాట్లాడుతూ, పెరిక కులానికి చెందిన బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ ఏకతాటిపై నిలబడి అంజలి దేవి గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. న్యాయవృత్తిలో సేవాభావంతో పనిచేసే అంజలి కి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఆమె గెలుపుతో కులానికే కాకుండా సమాజానికి, న్యాయవ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు..

ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర సంఘం అధ్యక్షులు శ్రీరామ్ దయానంద్ , బొలిశెట్టి వీరయ్య, దాసరి మల్లేశం ,పాయిల జంగయ్య , విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు , భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు సుందరి వీరభాస్కర్ గారు, రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ , సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి వలిశెట్టి లక్ష్మీ శేఖర్ , సంక్షేమ సమితి అధ్యక్షులు బత్తిని పరమేష్ , రాష్ట్ర సంఘం ఆర్థిక కార్యదర్శి సందెల లింగం, వసతి గృహం ప్రధాన కార్యదర్శి అచ్చ రఘు కుమార్ , ఆర్థిక కార్యదర్శి బాల్దూరి రవికుమార్ , కార్యనిర్వాక కార్యదర్శి, అంకతి విజయ్ కుమార్ , పవన్ నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ , యువజన విభాగపు గౌరవాధ్యక్షులు మైలారిశెట్టి చైతన్య , ఎల్బీనగర్ జోన్ గౌరవ అధ్యక్షుడు బొలిశెట్టి నరసింహరావు , ఎల్బీనగర్ జోన్ అధ్యక్షుడు బుద్దె వెంకటేశ్వర్లు , ప్రధాన కార్యదర్శి ముత్తినేని వెంకటేశ్వర్లు , లాయర్ విభాగపు కోఆర్డినేటర్ జూకూరి మహేష్ పాల్గొన్నారు.

RECENT POST:-

పరిశ్రమల శాఖ… కాలుష్యాన్ని నియంత్రించే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

10 Foods for High-Protein Foods

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *