Navataram

Real news Real time

పల్లె అభివృద్ధి – బాధ్యత ఎవరిది?

“ఎన్ని ప్రభుత్వాలు మారినా మా పల్లెటూర్ల పరిస్థితులు ఎందుకు మారవు?”

అనే ప్రశ్నతో యువ సామాజిక కార్యకర్త బలగ ఆదిత్య కుమార్పల్లె అభివృద్ధి – బాధ్యత ఎవరిది? పై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంచాయతీ పరిధిలో పనిచేసే ప్రతి అధికారి ఆ గ్రామంలోనే నివసించాలని జీవో ఉన్నప్పటికీ, ఆ నియమం అమలు కావడం లేదని ఆయన పేర్కొన్నారు.

పల్లె అభివృద్ధి – బాధ్యత ఎవరిది?

ఆదిత్య కుమార్ మాట్లాడుతూ, “గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు, ఇతర అధికారులు చాలా చోట్ల తమ పంచాయతీ పరిధిలో నివసించడం లేదు. వారంతా పట్టణాల్లో ఉంటూ, వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే గ్రామానికి వస్తున్నారు. ఫలితంగా ప్రజలకు అందాల్సిన సేవలు ఆలస్యమవుతున్నాయి. ఇది పల్లె ప్రజల అభివృద్ధికి పెద్ద అడ్డంకి,” అని అన్నారు.

తన వ్యాసంలో ఆయన ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తూ — “మీరు చిన్నతనంలో చదివిన బడిపంతులు మీరు నివసించిన గ్రామంలో ఉన్నందువల్ల మీరు లబ్ధి పొందారు. అయితే అదే లబ్ధి ఈరోజు పల్లె పిల్లలకు ఎందుకు ఇవ్వడం లేదు? మీ మీద ఉన్న బాధ్యత మీకు తెలుసా?” అని ప్రశ్నించారు.

సాధారణ రోజుల్లో కూడా అలాగే ఉండలేరా?”

ఆదిత్య కుమార్ మరింతగా ఆవేదన వ్యక్తం చేస్తూ, “టెక్నాలజీ ఉన్నప్పటికీ ప్రజలతో ప్రత్యక్ష సంబంధం అవసరం. అధికారులు గ్రామాల్లో ఉంటే ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించవచ్చు. కానీ ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో లేరు. తుఫానులు వచ్చినప్పుడు ఎలా ప్రజల దగ్గర ఉంటారో, సాధారణ రోజుల్లో కూడా అలాగే ఉండలేరా?” అని ప్రశ్నించారు.

ఆయన అభిప్రాయమేమిటంటే, అధికారులు గ్రామాల్లో నివసిస్తే మాత్రమే పల్లెటూర్లలోని పిల్లలకు మంచి విద్య, ప్రజలకు సకాలంలో సేవలు, గ్రామానికి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని. “పల్లెటూర్లు పట్టణాలకు పట్టుకొమ్మలు. వాటిని నిర్లక్ష్యం చేయడం అంటే రాబోయే తరాల భవిష్యత్తును నిర్లక్ష్యం చేయడమే,” అని ఆదిత్య కుమార్ అన్నారు.

గ్రామాల్లో ప్రభుత్వ నియమాలను కచ్చితంగా అమలు చేయాలని, ప్రజా ప్రతినిధులు అధికారులపై పర్యవేక్షణ పెంచాలని ఆయన కోరారు. “ఇకనైనా అధికారులు తమ నియమాలు పాటించి, ప్రజలకు అందుబాటులో ఉంటూ, పల్లెటూర్ల అభివృద్ధికి కృషి చేయాలి” అని బలగ ఆదిత్య కుమార్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *