Navataram

Real news Real time

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వైద్యాధికారులను ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు అవసరమైన మందులు, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, వైద్య పరికరాలు, కార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. వివిధ వైద్య విభాగాలు, గర్భిణులకు అందిస్తున్న సేవలు, చిన్నారుల చికిత్స విభాగం, ఐసీయూ గదులు, పడకలు, పిల్లల విభాగంలోని ఏసీలు, ఆసుపత్రి పరిసరాలను తనిఖీ చేశారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, వారి బరువు, అందిస్తున్న వైద్య సేవల గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. శిశువుల ఆరోగ్యంపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చికిత్స అందించాలని సూచించారు.

ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అవసరమైన మందులను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు మెరుగైన వైద్య సేవలు కలగకుండా చూడాలని ఆదేశించారు.

ఆసుపత్రిలో ఇంకా అవసరమైన వైద్య పరికరాలు, ఏసీలు, ఇతర సదుపాయాలకు సంబంధించి పూర్తి వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించారు. మరమ్మతులకు గురైన పరికరాలు, సదుపాయాలను వెంటనే బాగు చేయించాలని ఆదేశించారు. ఆసుపత్రి అధికారులు కోరిన అవసరమైన సదుపాయాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read :- డిజిటల్ విద్యను బోధనలో భాగం చేయాలి

ఆసుపత్రి ప్రాంగణంలో మద్యం సేవించి వచ్చి గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అటువంటి ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఆసుపత్రిలో ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగిస్తూ రోగులు, వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ అశోక్ కుమార్, ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీధర్, వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent Post:-

Eye Health: Why It Matters More Than Ever

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *