Navataram

Real news Real time

వన్యప్రాణి వారోత్సవాల్లో ట్రైల్ రన్, వనదర్శిని కార్యక్రమం

మంచిర్యాల: వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకొని లక్సెట్టిపేట రేంజ్ పరిధిలోని ఓల్డ్ మంచిర్యాల సెక్షన్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ట్రైల్ రన్ (ట్రెక్కింగ్), వనదర్శిని కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మహా డిఫెన్స్ అకాడమీ, మంచిర్యాలకు చెందిన సుమారు 80 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓల్డ్ మంచిర్యాల సెక్షన్ అటవీ ప్రాంతంలో నిర్వహించిన ట్రెక్కింగ్‌లో విద్యార్థులు పాల్గొని అడవులు, వన్యప్రాణులు, ప్రకృతి పరిరక్షణ ప్రాధాన్యతను తెలుసుకున్నారు.

అలాగే పాఠశాల విద్యార్థులతో వనదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు విద్యార్థులకు అడవుల సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతపై అవగాహన కల్పించారు. అడవులు, వన్యప్రాణులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు.

వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు విద్యార్థుల్లో ప్రకృతి, అటవీ సంపద, వన్యప్రాణుల పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడ్డాయి

Also Read :-

పార్వతీపురంలో ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ భారీ ర్యాలీ

How to Lower Your Blood Pressure Naturally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *