జిల్లాలో భూ సర్వే పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కన్నెపల్లి మండలం శిక్నం గ్రామంలో ప్రారంభమైన భూ రీ సర్వే పనులను ఆయన పరిశీలించారు.

రీ సర్వేలో భాగంగా చేపట్టిన గ్రామ సరిహద్దుల నిర్ధారణ కార్యక్రమాన్ని మండల తహసీల్దార్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన అన్ని పనులను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సర్వే పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
జి.ఓ. నెం.76 అమలుపై క్షేత్రస్థాయి పరిశీలన
భూ సర్వే అనంతరం బెల్లంపల్లి మండలం టేకులబస్తీలో జి.ఓ. నెం.76 కింద చేపడుతున్న క్షేత్రస్థాయి విచారణ, సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ పరిశీలించారు. క్షేత్రస్థాయి సర్వే పనులను మరింత వేగవంతం చేయాలని సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు.
తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష
భూ సర్వే అనంతరం బెల్లంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి జి.ఓ. నెం.76 అమలు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సాదాబైనామా దరఖాస్తులు, భూభారతి, ఎస్‌ఐఆర్ ప్రక్రియలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఇతర రెవెన్యూ సంబంధిత పనులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జి.ఓ. నెం.76 కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలనతో పాటు క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ప్రజలకు రెవెన్యూ సేవలు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ వి. రాములు స్పష్టం చేశారు.










Leave a Reply