ప్రత్యేక అధికారి పాలనలోనైనా పార్వతీపురం మున్సిపాలిటీ తిరిగి గాడిలో పడాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పార్వతీపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిసిసి జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు, లీగల్ సెల్ ఇంచార్జ్ కోల కిరణ్ కుమార్, ఓబీసీ చైర్మన్ సిరిసిపల్లి సాయి శ్రీనివాస్, యువజన నాయకుడు గొర్లి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో వైసీపీ, టీడీపీ పాలనలో మున్సిపాలిటీ పరిపాలన గాడి తప్పిందని ఆరోపించారు. ప్రస్తుతం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి నియమితులవడం సంతోషకరమని తెలిపారు. ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకుని పారదర్శకంగా పాలన సాగించాలని కోరారు.
ప్రధానంగా పట్టణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న తాగునీటి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమయపాలన పాటిస్తూ ప్రతిరోజూ కుళాయిలకు నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే స్వచ్ఛమైన తాగునీటి సరఫరా కల్పించాలని కోరారు. తరాలుగా కొనసాగుతున్న చెత్త డంపింగ్ యార్డ్ సమస్యను కూడా తక్షణమే పరిష్కరించాలని అన్నారు.
పార్వతీపురంలో పారిశుధ్య నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉందని పేర్కొంటూ, 24 గంటల పారిశుధ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైన సిబ్బంది నియామకం చేసి, యంత్రాల ద్వారా శుభ్రత పనులు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా చెరువులు, ప్రభుత్వ భూములు, వరహాల గెడ్డలపై జరుగుతున్న ఆక్రమణలను వెంటనే తొలగించి వాటిని రక్షించాలని కోరారు.
పట్టణంలోని వార్డుల్లో కాలువలు, సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టాలని, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. శివారు ప్రాంతాలకు తాగునీటి పైపులైన్ నిర్మాణం, వీధి దీపాల నిర్వహణను సక్రమంగా చేయాలని కోరారు. ప్రత్యేక అధికారి పాలనలో పార్వతీపురం మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
Recent Post:-
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలి
Best Foods for Hair Growth: A Complete Diet Guide for Strong and Healthy Hair











Leave a Reply