Navataram

Real news Real time

కర్తవ్య నిర్వహణలోనే ప్రాణాలు విడిచిన సీఐ

విజయవాడ:

విధి నిర్వహణలో ఉండగానే నున్న సీఐ అహ్మద్ అలీ గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద ఆదివారం ప్రజారక్షణ, బందోబస్తు విధుల్లో నిమగ్నమైన ఆయన అకస్మాత్తుగా కుప్పకూలారు. వెంటనే చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యంలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.అహ్మద్ అలీ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై నున్న సీఐగా బాధ్యతలు స్వీకరించారు. విధి నిర్వహణలో భాగంగా అలంకార్ ధర్నా చౌక్ వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.కర్తవ్య నిర్వహణలోనే ప్రాణాలు విడిచిన సీఐ

సీఐ అహ్మద్ అలీ నిబద్ధతతో విధులు నిర్వర్తించే అధికారిగా గుర్తింపు పొందారని ఏఐవైఎఫ్ నాయకులు పేర్కొన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే అధికారిగా ఆయన సేవలందించారని తెలిపారు.విధి నిర్వహణలో ఉండగానే ఆయన మృతి చెందడం పోలీసు శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు, రాజకీయ మరియు సామాజిక నాయకులు ఆయన మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నారు.కర్తవ్య నిర్వహణలోనే ప్రాణాలు విడిచిన సీఐ

అహ్మద్ అలీ గారి అకాల మరణంపై ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF) తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేసిన ఒక అధికారిని కోల్పోవడం బాధాకరమని పేర్కొంది. కర్తవ్య నిర్వహణలోనే ప్రాణాలు విడిచిన సీఐ కర్తవ్య నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయిన అహ్మద్ అలీ సేవలను స్మరించుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ఏఐవైఎఫ్ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.అహ్మద్ అలీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

RECENT POST

భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి

Keto Diet Foods Ideas: The Ultimate Guide to Eating Smart on Keto

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *