మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు అధికారులను ఆదేశించారు.
మంగళవారం మందమర్రి పట్టణంలోని ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం కె.ఆర్. గార్డెన్స్లో మందమర్రి తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్, సిబ్బందితో కలిసి ఎఈఆర్ఓలు, బిఎల్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్లతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నో మ్యాపింగ్, అనామోలీస్కు సంబంధించిన ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించడం ద్వారా తమ ఓటు హక్కును ధ్రువీకరించుకోవచ్చని పేర్కొన్నారు.ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం.
ఓటర్లు సమర్పించిన ధ్రువపత్రాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఓటరు జాబితా సవరణలో ఖచ్చితత్వం అత్యంత కీలకమని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి దశను నిబంధనల ప్రకారం నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎఈఆర్ఓలు, బిఎల్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేయాలని వి. రాములు సూచించారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply