బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని బుచ్చయ్యపల్లి గ్రామంలో ఇటీవల ప్రమాదాలకు గురైన బాధితులను మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరామర్శించారు.

గ్రామానికి చెందిన యధానవేణి రాజయ్య కుమారుడు వసంత్ గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న దుర్గం చిన్నయ్య ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బైక్ ప్రమాదంలో గాయపడిన పానగంటి సాయిని కూడా పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మండల అధ్యక్షుడు సింగం గణేష్ గౌడ్, మాజీ ఎంపీపీ పొట్లపల్లి సుభాష్ రావు, పాయవేణి మల్లేష్, మండల యూత్ అధ్యక్షుడు కొత్తపల్లి మహేందర్, మాజీ సర్పంచ్ పోలవేణి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ ఆగిడి వెంకటేశ్వర్లు, గ్రామ అధ్యక్షుడు మామిడి శ్రీనివాస్, అట్కాపురం బాపు, తోకల రమేష్, గంధం తిరుపతి, అయిల్ల కృష్ణ, ఎదునూరి ప్రభాకర్, ధర్మేందర్, వేల్పుల శ్రీనివాస్, మధుకర్, సుమన్, లవన్, రాయమల్లు, రాకేష్, రాజకుమార్, కోలా మహేష్, అంజయ్య, ఉదయ్, సమ్మయ్య, ప్రశాంత్, ఉమకర్ తదితరులు పాల్గొన్నారు.
Recent Post:-
ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి 15 రోజులైనా పట్టించుకునే నాథుడే లేడు
How to Build the Best Exercise Routine for Long-Term Success











Leave a Reply