ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం ఎంప్లాయీస్ యూనియన్ అభ్యర్థులను గెలిపించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి ఆదిలాబాద్ రీజినల్ గౌరవ అధ్యక్షుడు కలవేన శంకర్ కార్మికులను కోరారు.

ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో మంగళవారం కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు వారి హక్కులను పరిరక్షించేందుకు ఎంప్లాయీస్ యూనియన్ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. కార్మికుల హక్కుల ,కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్ర గుర్తింపు ఎన్నికల్లో ‘బస్సు’ గుర్తుకు, స్థానిక గుర్తింపు ఎన్నికల్లో ‘నిచ్చెన’ గుర్తుకు ఓటు వేసి ఎంప్లాయీస్ యూనియన్ను గెలిపించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కార్మికుల ఐక్యతతోనే కార్మికుల హక్కుల ను సాధించుకోవడం సాధ్యమవుతుందని శంకర్ పేర్కొన్నారు.
కార్మికుల హక్కుల ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి ఎల్పుల అశోక్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దినాకర్, ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి సోమరాపు తిరుపతి, సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామడుగు లక్ష్మణ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కూటమి నాయకులు, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Recent Post:-
ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి 15 రోజులైనా పట్టించుకునే నాథుడే లేడు











Leave a Reply