Navataram

Real news Real time

తల్లి జ్ఞాపకార్థం ఉచిత వైకుంఠ రథం..

మంచిర్యాల జిల్లా, హాజీపూర్,

మనిషి జీవిత ప్రయాణంలో చివరి మజిలీ కూడా గౌరవప్రదంగా సాగాలనే మానవీయ సంకల్పంతో హాజీపూర్ సర్పంచ్ దంపతులు ఆదర్శవంతమైన సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో సర్పంచ్ మాధవరపు శ్రీలత–రామారావు దంపతుల ప్రోత్సాహంతో, తమ తల్లి కీ.శే. మాధవరపు అరవింద జ్ఞాపకార్థం గ్రామ ప్రజల కోసం ఉచిత వైకుంఠ రథాన్ని గ్రామపంచాయతీకి అందజేశారు.

గురువారం నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి వైకుంఠ రథాన్ని ప్రారంభించారు. అంత్యక్రియల సమయంలో ప్రజలకు ఎంతో అవసరమైన ఈ సేవను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా హాజీపూర్ సర్పంచ్ మాధవరపు శ్రీలత–రామారావు మాట్లాడుతూ, మనిషి బతికున్నప్పుడు అనేక విధాలుగా సమాజానికి సేవ చేయవచ్చని, అయితే మరణించిన వ్యక్తి చివరి ప్రయాణంలో కుటుంబ సభ్యులకు అండగా నిలవడం కూడా గొప్ప మానవీయ సేవ అని పేర్కొన్నారు.ఉచిత వైకుంఠ రథం

తమ తల్లి కీ.శే. మాధవరపు అరవింద జ్ఞాపకార్థం ఈ వైకుంఠ రథాన్ని గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా వైకుంఠ రథాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సర్పంచ్ దంపతులు వెల్లడించారు.

గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా అవసరమైన సేవలు అందించడంతో పాటు హాజీపూర్ మండల పరిధిలోని ప్రజలందరూ వైకుంఠ రథాన్ని ఉచితంగా వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు.ఉచిత వైకుంఠ రథం

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు సర్పంచ్ మాధవరపు శ్రీలత–రామారావు దంపతులు తెలిపారు.

త్వరలో గ్రామంలో డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నూతనంగా ఏర్పాటు చేయనున్న శ్మశానవాటికలో సమస్యలను పరిష్కరించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Also Read :- Best Foods for Hair Growth: A Complete Diet Guide for Strong and Healthy Hair

గ్రామ ప్రజలకు అత్యవసరమైన వైకుంఠ రథాన్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడంపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సర్పంచ్ మాధవరపు శ్రీలత–రామారావు దంపతులను అభినందించారు.

తల్లి జ్ఞాపకార్థం చేపట్టిన ఈ సేవా కార్యక్రమం సమాజంలో మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Recent Post:-

వన్యప్రాణి వారోత్సవాల్లో ట్రైల్ రన్, వనదర్శిని కార్యక్రమం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *