ప్రస్తుత సాంకేతిక యుగంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు డిజిటల్ విద్యా విధానాలను పూర్తిస్థాయిలో అవగాహన చేసుకొని, తరగతి గది బోధనలో సమర్థవంతంగా డిజిటల్ విద్యను బోధనలో భాగం చేయాలి వినియోగించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాశాఖ అధికారి పి.చంద్రయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కార్మల్ ఉన్నత పాఠశాల, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, శక్తి ఐటిఐ, నస్పూర్ మండలం శ్రీరాంపూర్ ప్రాంతంలో గల అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ లలో జిల్లాలోని భౌతిక శాస్త్ర స్కూల్ అసిస్టెంట్ల కోసం “ది బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్” అంశంపై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అదనకు కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ వనరులను బోధనలో సమర్థవంతంగా వినియోగించడం ద్వారా విద్యార్థులలో ఆసక్తి, అవగాహన, సృజనాత్మకత పెంపొందించవచ్చని తెలిపారు. డిజిటల్ విద్యను బోధనలో భాగం చేయాలి డిజిటల్ సాంకేతికతను వినియోగిస్తూ హైస్కూల్ విద్యను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక కార్యక్రమమైన ఖాన్ అకాడమీను ఉపాధ్యాయులు విస్తృతంగా వినియోగించి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని తెలిపారు. డిజిటల్ సాంకేతికతను కేవలం శిక్షణ కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, పాఠశాల స్థాయిలో నిరంతరం బోధనలో భాగం చేయాలని తెలిపారు. తద్వారా విద్యార్థులకు మెరుగైన అభ్యసన అవకాశాలు కల్పించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని తెలిపారు.డిజిటల్ విద్యను బోధనలో భాగం చేయాలి.
ఈ కార్యక్రమంలో కోర్స్ కో-ఆర్డినేటర్ జంబోజు సత్తయ్య, కోర్స్ ఇన్చార్జ్ రాజేశం, జిల్లా రిసోర్స్ పర్సన్స్ రాజన్న, అర్క కుమార్, భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Recent Post:-
రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి: సీపీఐ
Diet for Losing Weight: A Simple and Practical Guide That Actually Works











Leave a Reply