Navataram

Real news Real time

హాజీపూర్, ధర్మారంలో వీవో భవనాల నిర్మాణానికి భూమిపూజ

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని హాజీపూర్, ధర్మారం గ్రామాల్లో మహిళా సంఘాల సౌకర్యార్థం వీవో (గ్రామ సమైక్య) భవనాల నిర్మాణ పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. VBG-RAM G పథకం కింద రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న మూడు వీవో భవనాలకు స్థానిక సర్పంచ్ మాధవరపు శ్రీలత-రామారావు ముఖ్య అతిథిగా హాజరై, పంచాయతీరాజ్ ఏఈఈ అన్వర్, ఐకేపీ ఏపీఎం వెంకటేష్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి భూమిపూజ చేశారు.

అనంతరం ధర్మారం గ్రామంలో ఇదే పథకం కింద రూ.90 వేల అంచనా వ్యయంతో నిర్మించనున్న మేకల షెడ్డు నిర్మాణ పనులకు కూడా భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.వీవో భవనాల నిర్మాణానికి భూమిపూజ.

ఈ సందర్భంగా సర్పంచ్ మాధవరపు శ్రీలత-రామారావు మాట్లాడుతూ.. మహిళా సంఘాల సమావేశాల నిర్వహణతోపాటు గ్రామీణ మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీవో భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత మహిళా సంఘాల సమావేశాలతోపాటు ఇతర కార్యక్రమాల నిర్వహణకు ఈ భవనాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.వీవో భవనాల నిర్మాణానికి భూమిపూజ.

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇటువంటి నిర్మాణాలు దోహదపడతాయని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం చేపడుతున్న నిర్మాణ పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.వీవో భవనాల నిర్మాణానికి భూమిపూజ.

ఈ కార్యక్రమంలో VBG-RAM G సిబ్బంది టీఏ అనూష, ఈసీ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Recent Post:-

జిల్లాలో భూ సర్వే పనులను వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు

How to Lower Your Blood Pressure Naturally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *