Navataram

Real news Real time

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో గృహ నిర్మాణ శాఖ పి.డి., డిఈఈలు, ఎఈలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ప్రస్తుత పరిస్థితి, నిర్మాణ దశలను, పూర్తికి అవసరమైన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష ఇందిరమ్మ ఇండ్లను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో, జిల్లాకు 2 వేల 547 ఇందిరమ్మ ఇండ్లు చివరి దశ వరకు పూర్తి చేయవలసిన లక్ష్యం నిర్దేశించడం జరిగిందని తెలిపారు. ఈ లక్ష్యాన్ని దసరా పండుగ లోపు తప్పనిసరిగా పూర్తి చేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనులలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి, లబ్ధిదారులతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RECENT POST:-

పుట్టినరోజు సందర్భంగా పెరిక భవనానికి రూ.1 లక్ష విరాళం..!

How to Build the Best Exercise Routine for Long-Term Success

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *