గతంలో రూ.2 లక్షలు.. తాజాగా మరో రూ.1 లక్ష.. మొత్తం రూ.3 లక్షల విరాళం
హైదరాబాద్: విదేశాల్లో స్థిరపడినా తన సామాజిక సేవా భావాన్ని కొనసాగిస్తూ పెరిక సమాజ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నారు మంచిర్యాల జిల్లా కన్నెపల్లి గ్రామానికి చెందిన డా. గడికొప్పుల శ్రీనివాస్. లండన్లో ఆర్థోపెడిక్ డాక్టర్గా స్థిరపడిన ఆయన, కోకాపేటలో నిర్మిస్తున్న పెరిక ఆత్మగౌరవ భవనానికి తన పుట్టినరోజు సందర్భంగా మరో రూ.1 లక్ష విరాళాన్ని అందించారు.

తమ తల్లిదండ్రులు కీ.శే. రాజయ్య–రామదేవి గార్ల జ్ఞాపకార్థం కోకాపేట పెరిక భవన నిర్మాణానికి డా. గడికొప్పుల శ్రీనివాస్ దంపతులు మొత్తం రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా గతంలో రూ.2 లక్షలు అందించగా, తాజాగా పుట్టినరోజు సందర్భంగా మరో రూ.1 లక్షను విరాళంగా అందించారు. దీంతో ఇప్పటివరకు భవన నిర్మాణానికి వారు అందించిన మొత్తం విరాళం రూ.3 లక్షలకు చేరింది.
పెరిక ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి తన పుట్టినరోజును వ్యక్తిగత వేడుకగా మాత్రమే కాకుండా కుల సమాజ సేవకు ఉపయోగించడం ఆదర్శప్రాయమని తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. కోకాపేటలో నిర్మిస్తున్న పెరిక ఆత్మగౌరవ భవనం భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా, సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు.
లండన్లో స్థిరపడినప్పటికీ పెరిక సమాజంతో తన అనుబంధాన్ని కొనసాగిస్తూ భవన నిర్మాణానికి సహకరిస్తున్న డా. గడికొప్పుల శ్రీనివాస్ గారి సేవాభావాన్ని పెరిక ఆత్మగౌరవ భవనం తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అభినందించింది.
పెరిక ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి డా. గడికొప్పుల శ్రీనివాస్–శైలజ దంపతులకు తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం తరఫున అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్, భవన గౌరవ అధ్యక్షుడు మద్దా లింగయ్య, అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్, మాజీ అధ్యక్షులు శ్రీరామ్ దయానంద్, కోపరేటివ్ సొసైటీ అధ్యక్షులు అందె శ్రీనివాస్ తదితరులు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.
కోకాపేట పెరిక ఆత్మగౌరవ భవన నిర్మాణానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం కోరింది.
Recent Post:-
జలధారపై రోజువారీ టెలి కాన్ఫరెన్స్లు: అధికారులకు కలెక్టర్ సూచనలు











Leave a Reply