Navataram

Real news Real time

నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో గల జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 9వ తరగతి, 11వ తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న లేటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్–2027కు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య తెలిపారు.

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హత కలిగిన విద్యార్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తు

9వ తరగతిలో ప్రవేశం కోరుకునే విద్యార్థులు 9వ తరగతి ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా, 11వ తరగతిలో ప్రవేశం కోరుకునే విద్యార్థులు 11వ తరగతి ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా అక్టోబర్ 15, 2026లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

9వ తరగతి ప్రవేశాలకు Click here

11వ తరగతి ప్రవేశాలకు Click here

ఏప్రిల్ 10న ప్రవేశ పరీక్ష

లేటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్‌ను ఏప్రిల్ 10న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకొని నిర్ణీత తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య కోరారు.నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తు

విద్యా సంవత్సరం: 2027–28

ప్రవేశాలు: 9వ తరగతి, 11వ తరగతి

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 15, 2026

దరఖాస్తు రుసుము: లేదు

ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 10

పరీక్ష సమయం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు

విద్యాలయం: జవహర్ నవోదయ విద్యాలయం, కాగజ్‌నగర్

నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తు

Also Read :- యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న రైతులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *