యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు జిల్లాలో వినిపిస్తున్నాయి. ప్రభుత్వ యాప్లో యూరియా కోసం బుకింగ్ చేసుకున్నప్పటికీ, బస్తాలు తీసుకునేందుకు డీలర్లు, పీఏసీఎస్ (PACS) కేంద్రాలను ఆశ్రయించిన సమయంలో కొందరు రైతులకు నిరాశ ఎదురవుతోందని వారు వాపోతున్నారు.

“మీరు ఇంతకుముందే యూరియా తీసుకున్నారు.. ఇప్పుడు ఇవ్వలేం” అంటూ కొందరు డీలర్లు, పీఏసీఎస్ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. యాప్లో బుకింగ్ పూర్తయిన తర్వాత కూడా యూరియా అందకపోవడంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
రూ.266 యూరియా బస్తా.. రూ.350–360కు విక్రయం జరుగుతోందా?
యూరియా బస్తా ఎమ్మార్పీ రూ.266గా ఉండగా, కొందరు ప్రైవేట్ ఫెర్టిలైజర్ డీలర్లు రూ.350 నుంచి రూ.360 వరకు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అలాగే కొన్ని పీఏసీఎస్, HAK కేంద్రాల్లో రూ.320 వరకు వసూలు చేస్తున్నట్లు పలువురు రైతులు చెబుతున్నారు.
అయితే యూరియా ఈ ధరలపై అధికారికంగా తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అదనంగా వసూలు చేస్తున్నారా? లేదా రవాణా తదితర ఖర్చుల పేరుతో ధర పెరుగుతోందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని రైతులు అంటున్నారు.
ట్రాన్స్పోర్ట్ ఖర్చుల అంశంపై రైతుల ప్రశ్నలు
యూరియా ధరలపై ఆసిఫాబాద్ మండల వ్యవసాయ అధికారిని రైతులు ప్రశ్నించగా, ప్రభుత్వం నుంచి యూరియా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు రావడం లేదని, తాము ఏం చేయాలని సమాధానం ఇచ్చినట్లు రైతులు చెబుతున్నారు.
అయితే ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ కంటే అదనంగా రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
యాప్లో బుకింగ్ ఉన్నా యూరియా ఎందుకు ఇవ్వడం లేదు?
ప్రభుత్వ యాప్లో యూరియా కోసం బుకింగ్ చేసుకున్న రైతులకు బస్తాలు ఎందుకు అందడం లేదనే ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. గతంలో రైతు తీసుకున్న యూరియా వివరాలను ప్రస్తుత బుకింగ్తో ఏ విధంగా అనుసంధానం చేస్తున్నారు? యాప్లో బుకింగ్ పూర్తయిన తర్వాత పంపిణీ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? అనే విషయాలను అధికారులు రైతులకు వివరించాలని కోరుతున్నారు.
అలాగే బుకింగ్ సమయంలో ఒక విధమైన సమాచారం కనిపించి, యూరియా తీసుకునే సమయంలో మరో విధమైన నిబంధనలు అమలు చేస్తున్నారా? అనే అంశంపైనా స్పష్టత అవసరమని రైతులు అంటున్నారు.
యూరియా కొరతపై అధికారులు స్పందించాలి
వ్యవసాయ సీజన్లో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో యాప్ బుకింగ్ నుంచి యూరియా బస్తా రైతు చేతికి చేరే వరకు మొత్తం పంపిణీ వ్యవస్థను అధికారులు సమీక్షించాలని రైతులు కోరుతున్నారు.
ప్రైవేట్ డీలర్లు, పీఏసీఎస్, HAK కేంద్రాల్లో యూరియా ధరలపై తనిఖీలు నిర్వహించి, ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్నారా లేదా అనే విషయాన్ని అధికారులు వెల్లడించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అదేవిధంగా గతంలో యూరియా తీసుకున్న రైతులకు ప్రస్తుతం బుకింగ్ ఉన్నప్పటికీ ఎందుకు నిరాకరిస్తున్నారు? యాప్లో బుకింగ్ అయిన తర్వాత రైతుకు యూరియా అందించే బాధ్యత ఎవరిది? అనే అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నిర్దేశిత ధరకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.











Leave a Reply