దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రజల ఓటు హక్కును కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పార్వతీపురం జిల్లా ఇండియా కూటమి నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం పార్వతీపురం పట్టణంలోని సుందరయ్య భవనంలో ఇండియా కూటమి పార్టీల నాయకులు సమావేశమై దేశంలోని తాజా రాజకీయ పరిణామాలు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (SIR) అంశంపై చర్చించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ వంగల దాలినాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, సీపీఐ(ఎంఎల్) రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్ల సింగ్ రవికుమార్, సీఐటీయూ నాయకులు బీవీ రమణ, రైతు సంఘం నాయకులు బంటు దాసు, పీఎస్వో జిల్లా కార్యదర్శి బీటీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
SIRపై ఇండియా కూటమి నేతల ఆరోపణలు
SIR పేరుతో దేశవ్యాప్తంగా సుమారు 13.30 కోట్ల ఓట్ల తొలగింపునకు చర్యలు చేపట్టారని ఇండియా కూటమి నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్పై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన ఓటు హక్కుకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆయనను పదవి నుంచి తొలగించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ముందుగానే లక్షలాది మంది పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించడం ద్వారా బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. దేశ ప్రజలు స్పందించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకిక విలువలను కాపాడేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అక్టోబర్ 9న ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ ర్యాలీ
ఇండియా కూటమి జాతీయ నాయకత్వం పిలుపు మేరకు అక్టోబర్ 2 నుంచి ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం – Save Democracy Week’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
అందులో భాగంగా జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించామని, అక్టోబర్ 7న నియోజకవర్గ స్థాయిలో, అక్టోబర్ 8న మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అక్టోబర్ 9న పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఇండియా కూటమిలోని అన్ని పార్టీల ఆధ్వర్యంలో ‘ఓటును కాపాడండి – దేశాన్ని కాపాడండి (ఓటు బచావో.. దేశ్ బచావో)’ నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో సీపీఐ(ఎంఎల్) రెడ్ స్టార్ నాయకులు గరుగుబిల్లి సూరయ్య, సీఐటీయూ నాయకులు బీవీఆర్, పాలక రంజిత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం, సాలూరు, కురుపాం కోఆర్డినేటర్లు బత్తిన మోహన్ రావు, గేదెల రామకృష్ణ, అడ్డాకుల చిన్నారావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పత్తిక లక్ష్మయ్య, ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి సిరిసిపల్లి సాయి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు జాగాన భాస్కరరావు, సాలూరు నియోజకవర్గం చైర్మన్ సిగడాపు బంగారయ్య, కిసాన్ సెల్ అధ్యక్షులు బోను శంకరరావు, ఎస్టీ సెల్ అధ్యక్షులు పత్తిక లక్ష్మణరావు, ఆర్జీటీఆర్ఎస్ అధ్యక్షులు పాలక సంపత్ కుమార్, పట్టణ అధ్యక్షులు బంకురు ప్రకాష్ రావు, మండల అధ్యక్షులు తీళ్ల గౌరీ శంకర్రావు, మీసాల ఫ్రాన్సిస్, కోలక జయరాం, ఈ యొక్క ముఖలింగం, హారిక ధర్మారావు, బిడ్డిక రాజేశ్వరరావు, తెర్లి వెంకట్ నాయుడు, బిడ్డక శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Recent Post:-
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న గుజ్జుల ఈశ్వరయ్యను పరామర్శించిన హరీశ్రావు











Leave a Reply