హైదరాబాద్: ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్యను మంగళవారం పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించారు.

బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకులు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, సీపీఐ జాతీయ కార్యదర్శులు కె. రామకృష్ణ, పల్లా వెంకట్రెడ్డి, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు ఆసుపత్రికి వెళ్లి ఈశ్వరయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Also Read :- ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధనకు ఎంప్లాయీస్ యూనియన్ను గెలిపించాలి
ఈ సందర్భంగా ఆయనకు అందుతున్న వైద్య చికిత్స, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న నాయకులు, గుజ్జుల ఈశ్వరయ్య త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా ఉద్యమాల్లో తిరిగి చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.











Leave a Reply