Navataram

Real news Real time

బెల్లంపల్లి అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలోగా త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ రమేష్‌తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇందులో భాగంగా బెల్లంపల్లి పట్టణంలో చేపట్టిన అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, ఇతర మౌలిక వసతుల పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

పట్టణ పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ప్రతిరోజూ తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని ఆదేశించారు. పట్టణంలో ఎక్కడా నీటి నిల్వలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి.

అనంతరం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని మండలాల తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR 2026)లో భాగంగా మ్యాపింగ్ కాని, అనమలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసి, హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

భూ సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. గ్రామ నక్షాల తయారీ, వివిధ రకాల భూముల గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి.

అలాగే సాదా బైనామా, భూభారతి, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను సంబంధిత రికార్డులతో సరిచూసి, క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన 22-ఏ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

అనంతరం కాసిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న SIR 2026 హియరింగ్ ప్రక్రియ నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులతో ఆసుపత్రికి వచ్చే ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

అంటు వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని, ఆసుపత్రి పరిసరాల్లో పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. అవసరమైన మందులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

అనంతరం కాసిపేట మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రీ-సర్వే, భూభారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

తర్వాత జిల్లా కేంద్రంలోని హమాలివాడ ప్రాంతంలో వానర సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ భక్తాంజనేయ సాయి గణేష్ మండలి ఏర్పాటు చేసిన వినాయకుడిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

RECENT POST:-

150 మంది ఎస్సీ రైతులకు ఉచిత వ్యవసాయ పరికరాల పంపిణీ

Best Foods for Hair Growth: A Complete Diet Guide for Strong and Healthy Hair

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *