హాజీపూర్లో కర్ణమామిడి పీఏసీఎస్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ
రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన పాలకవర్గం పనిచేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచించారు. హాజీపూర్ మండలం కర్ణమామిడి పీఏసీఎస్ చైర్మన్గా కొట్టే మహేందర్, వైస్ చైర్మన్గా సాయిని రామ్ చందర్ రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు.గ్రామంలోని కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాలకవర్గ సభ్యులు అంకితభావంతో పనిచేసి రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.

రోజుకు 10 వేల లీటర్ల పాల సేకరణ లక్ష్యం:-
కర్ణమామిడి పీఏసీఎస్ పరిధిలో రోజుకు 10 వేల లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు, ధాన్యం బస్తాలు, ఇతర వ్యవసాయ సామగ్రి అందించేందుకు సహకరిస్తామని తెలిపారు.కమ్యూనిటీ హాల్లో డైనింగ్ వసతులు, ఇతర అభివృద్ధి పనుల కోసం త్వరలో రూ.20 లక్షలు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.వ్యవసాయ

రోడ్డు పనులు, పునరావాస సమస్యల పరిష్కారానికి హామీ
బీటీ, లింక్ రోడ్ల పనులను వచ్చే మార్చి లేదా ఉగాది నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కల్పించడం, ఎల్లంపల్లి పునరావాస పరిహార సమస్యలను మూడు నుంచి ఆరు నెలల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
యాసంగి పంటలపై రైతులకు సూచనలు
నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని యాసంగిలో పెద్ద పంటలు సాగు చేసి రైతులు నష్టపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. బోర్ల ఆధారంగా ఆరుతడి పంటలు, కూరగాయలు, స్వల్పకాలిక పంటలు సాగు చేయాలని కోరారు.పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, రైతులు తొందరపడి తక్కువ ధరలకు ధాన్యం విక్రయించవద్దని సూచించారు.
రైతుల కోసం పనిచేస్తా: పీఏసీఎస్ చైర్మన్ మహేందర్

నూతన పీఏసీఎస్ చైర్మన్ కొట్టే మహేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు.సొసైటీకి అవసరమైన ధాన్యం బస్తాలు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు, ప్రభుత్వ సబ్సిడీలు రైతులకు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కస్తూర్బా విద్యాలయానికి నూతన భవనం కోసం వినతి

కర్ణమామిడి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ప్రిన్సిపాల్ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థినుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నూతన భవనం నిర్మించాలని, విద్యార్థినుల అవసరాల కోసం సోలార్ వాటర్ హీటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
RECENT POST:-
పర్యాటక అభివృద్ధికి జిల్లాలో అపార అవకాశాలు
Diet for Losing Weight: A Simple and Practical Guide That Actually Works











Leave a Reply