Navataram

Real news Real time

కోకాపేట పెరిక ఆత్మగౌరవ భవనానికి త్వరలో ప్రభుత్వ నిధులు: మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ

హైదరాబాద్,:- కోకాపేటలో నిర్మిస్తున్న పెరిక కుల ఆత్మగౌరవ భవనానికి త్వరలోనే ప్రభుత్వం తరఫున నిధులు విడుదల చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. పెరిక కుల సభ్యుల సహకారంతో భవన నిర్మాణాన్ని వేగంగా కొనసాగించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం (రిజి. నం. 766/2014) అధ్యక్షుడు డా. గటిక విజయ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్ సెప్టెంబర్ 28న హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి కోకాపేటలో కొనసాగుతున్న పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణ పురోగతిని వివరించారు.

కోకాపేటలో నిర్మిస్తున్న పెరిక కుల ఆత్మగౌరవ భవనంలో ఇప్పటికే ఆరు స్లాబుల నిర్మాణం పూర్తయిందని సంఘం నాయకులు మంత్రికి తెలిపారు. వచ్చే నెలలో మరో స్లాబ్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వివరించారు.

కుల సభ్యుల నుంచే విరాళాలు సేకరించి భవన నిర్మాణాన్ని శరవేగంగా కొనసాగిస్తున్న తీరును మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. పెరిక కుల సభ్యుల ఐక్యతతో చేపడుతున్న ఈ నిర్మాణం ఇతర కులాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డా. గటిక విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైశ్య కుల ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన చేశారని, ప్రభుత్వం తరఫున నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు.రాష్ట్రంలో రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య తదితర కులాల ఆత్మగౌరవ భవనాలకు ప్రభుత్వం నిధులు అందిస్తున్న నేపథ్యంలో, బీసీలకు చెందిన పెరిక కుల ఆత్మగౌరవ భవనానికి కూడా ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు.

పెరిక సంఘం నాయకుల వినతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, ఈ అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించినట్లు తెలిపారు. పెరిక కుల ఆత్మగౌరవ భవనానికి త్వరలోనే ప్రభుత్వ నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ సహకారం లభిస్తే భవన నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తి చేసి, పెరిక కుల సభ్యులకు ఉపయోగపడే విధంగా ఆత్మగౌరవ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సంఘం నాయకులు ఆకాంక్షించారు.

Recent post:-

పహాణీ, జమాబందీ రికార్డులు ఉంటేనే ఓనర్‌షిప్‌ వస్తుందా?

10 Essential Sleep Hygiene Tips for Better Rest Every Night

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *