Navataram

Real news Real time

విద్యార్థులు ఇష్టపడి చదివితే విజయం ఖాయం

విద్యార్థులు ఇష్టపడి చదివితే విజయం ఖాయం – సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ వెంకట చారి

విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే విజయం ఖాయం అవుతుందని సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ వెంకట చారి అన్నారు.

శనివారం రెబ్బెన్ మండలం గోలేటి లోని సింగరేణి హై స్కూల్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, వసతులు, వార్షిక ఫలితాల వివరాలను సమీక్షించారు.

విద్యార్థులు స్టేజ్‌పై భయం లేకుండా మాట్లాడే అలవాటు పెంచుకోవాలని, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో సత్సంబంధంగా మాట్లాడారు.

“విద్యార్ధి దశలో 7, 8, 9, 10వ తరగతులు అత్యంత కీలకం. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ప్రతి విషయంపై అవగాహన పెంచుకోవాలి,”
అన్నారు.”

ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులను సూచించారు.

తరువాత జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఇంచార్జ్ జిఎం మచ్చగిరి నరేందర్ ఆధ్వర్యంలో అధికారులు వెంకట చారిని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌.ఓ. టు జిఎం కె. రాజమల్లు, టీజిఎం (సివిల్) ఎస్‌.కె. మదీనా బాషా, కరస్పాండెంట్ మండల శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు రవితేజ, ఉపాధ్యాయులు ఆర్ల రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *