Navataram

Real news Real time

కుల వివక్ష నిర్మూలనకై బసవేశ్వర చేసిన కృషి చిరస్మరణీయం

కుల వివక్ష నిర్మూలన కొరకు బసవేశ్వర చేసిన కృషి చిరస్మరణీయమని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బసవేశ్వర జయంతి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భాగ్యవతి, జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్ లతో కలిసి హాజరై బసవేశ్వర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, శ్రామికుల గౌరవం, కుల వివక్ష నిర్మూలన, నైతిక విలువల ప్రోత్సాహం కోసం బసవేశ్వర చేసిన కృషి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలిపారు.

బసవేశ్వర అందించిన బోధనలు, వచనాలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. బసవేశ్వర ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని  తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, బి.సి. సంఘాల ప్రతినిధులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent Post:-

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

Diet for Losing Weight: A Simple and Practical Guide That Actually Works

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *