Navataram

Real news Real time

చిత్తడి నేలగా గుర్తించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

జిల్లాలోని లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో గల చెరువును చిత్తడి నేలగా ప్రకటించేందుకు రాష్ట్రస్థాయిలో జరగనున్న సమావేశానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య లతో కలిసి రెవెన్యూ, మత్స్య, నీటిపారుదల, వ్యవసాయ, పర్యాటక శాఖల అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెంకట్రావుపేట గ్రామంలోని చెరువు 132 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉందని, ఈ చెరువు వలస పక్షులకు ప్రపంచ ప్రసిద్ధి పొందిందని తెలిపారు. వలస పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి నివాసాలు ఏర్పరచుకుని ఉండడం వలన గుర్తింపు పొందిందని, వలస పక్షులతో పాటు స్థానిక పక్షులకు ఒక సురక్షిత ఆవాస ప్రాంతాన్ని ఏర్పరిచేందుకు ఈ చెరువును చిత్తడి నేలగా ప్రకటించడానికి గ్రామస్తులు,  నీటిపారుదల, రెవెన్యూ, మత్స్య, పర్యాటక శాఖల అధికారులకు ఎలాంటి అభ్యంతరం లేదని, చిత్తడి నేలగా ప్రకటించేందుకు తాము అంగీకరిస్తున్నామని తెలియజేశారని వివరించారు. చిత్తడి నేలగా

చిత్తడి నేలగా ప్రకటించినట్లయితే కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేయబడతాయని, తద్వారా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగే సమావేశానికి ముందు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించారు. చిత్తడి నేలగా

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent Post:-

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలి

Best Foods for Hair Growth: A Complete Diet Guide for Strong and Healthy Hair

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *