ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములు తో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.

నెన్నెల మండలం నార్వాయిపేట గ్రామానికి చెందిన కైరత్ పాషా తమ తాతల నుండి వారసత్వంగా వస్తున్న భూమిని కొందరు అక్రమంగా మార్చి పట్టా చేసుకున్నారని, ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రజావాణి అర్జీ సమర్పించారు. మంచిర్యాల పట్టణానికి చెందిన సాయిని శ్రీనివాస్ తనకు హాజీపూర్ మండలం దొనబండ గ్రామ శివారులో గల భూమి వివరాలను భూ భారతి పోర్టల్ లో నవీకరించి పట్టా పాస్ పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు ప్రజావాణి అందజేశారు. తాండూర్ మండలం బోయపల్లి గ్రామానికి చెందిన ఎలిగేటి సాయికుమార్ తమ తాతల నుండి వారసత్వంగా వస్తున్న భూమిని తమకు ఎలాంటి సమాచారం లేకుండా కొందరు విక్రయించారని, ఈ విషయమై తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామానికి చెందిన తాళ్లపల్లి నరేష్ తాను రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసిన భూమిని తన పేరిట ఆన్లైన్ లో నమోదు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. దండేపల్లి మండల కేంద్రానికి చెందిన గుండా రవీందర్ తల్లితండ్రుల పోషణ చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి అయినా తన కుమారుని నుండి ప్రతినెల నగదు ఇప్పించి ఆదుకోవాలని కోరుతూప్రజావాణి దరఖాస్తు అందజేశారు.

మంచిర్యాల పట్టణానికి చెందిన కొత్త మాధవి, కొత్త కిరణ్ మానసిక దివ్యాంగులు అయిన తమకు పెన్షన్ ఇప్పించాలని వేరువేరుగా కోరుతూ అర్జీలు సమర్పించారు. మంచిర్యాల పట్టణం తిలక్ నగర్ కు చెందిన లింగన్నపేట సత్యనారాయణ తనకు వృద్ధాప్య పింఛన్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. లక్షెట్టిపేట మండలం పోతపల్లి గ్రామానికి చెందిన ఆవునూరి రాయలింగు తనకు గల భూమి ప్రభుత్వ రికార్డులలో తప్పిపోయిందని, నమోదు చేసి పట్టా ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
Recent Post:-
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలి
Best Foods for Hair Growth: A Complete Diet Guide for Strong and Healthy Hair











Leave a Reply