మంత్రి డా. వివేక్ వెంకటస్వామి – ప్రజలతో ఆత్మీయ మమేకం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గడప గడప ప్రచారంలో షేక్పేట్ డివిజన్ పరిధిలోని వినాయక నగర్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి బుధవారం గడప గడప ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించారు.
ప్రతి ఇంటికి గ్యారంటీ కార్డులు పంపిణీ చేస్తూ, మంత్రి “కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం మాటల్లో కాకుండా, పనుల్లో కనిపిస్తున్నాయి. మహిళలకు ₹500 రూపాయల చెల్లింపు, ఉచిత బస్ ప్రయాణం, రైతులకు సకాలంలో రుణమాఫీ, పేదలకు ఇళ్ల నిర్మాణం – ఇవన్నీ మా ప్రభుత్వం ఇచ్చిన మాటల సాక్ష్యం,” అని పేర్కొన్నారు.
గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో
గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి పరంగా తీవ్రంగా వెనుకబడిపోయిందని మంత్రి విమర్శించారు. “ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు, మురుగు కాలువలు, రోడ్లు వంటి ప్రాథమిక సదుపాయాలు లేకుండా వదిలేశారు. ఇప్పుడు యువ నాయకుడు నవీన్ యాదవ్ ని భారీ మెజారిటీతో గెలిపించి, ఈ ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేయాలి. యువతకు ఉద్యోగావకాశాలు, విద్యార్థులకు సదుపాయాలు, మహిళలకు స్వయం ఉపాధి – ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యాలు” అని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు “కేసీఆర్ దొర కార్డు – జనానికి మాటలు, సొంతవారికి మూటలు” అనే కార్డులను కూడా పంపిణీ చేశారు. ఆ కార్డుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలను స్పష్టంగా ప్రస్తావించారు. అందులో నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సిన భత్యం, ప్రతి ఇంటికి ఉద్యోగం అనే వాగ్దానం, రేషన్ కార్డుల బాకీలు, దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి వంటి వాగ్దానాలు నెరవేరలేదని పేర్కొన్నారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ
మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, “ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం, వాటికి పరిష్కారం చూపడం మా ప్రభుత్వ ధ్యేయం. కాంగ్రెస్ ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా పనిచేస్తోంది. గతంలో చేసిన తప్పులు తిరగరాయడం కాదు, భవిష్యత్తు నిర్మించడం మా లక్ష్యం,” అని చెప్పారు.
తన ప్రసంగంలో మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, “ఓట్ల కోసం వచ్చే ముళ్ల గులాబీలను (బీఆర్ఎస్ నాయకులను) ఈసారి బరాబరగా నిలదీయండి. మాటలు మాత్రమే చెప్పే నాయకులకన్నా, పనులు చేసే నాయకులను ఎంచుకోండి. కాంగ్రెస్ మాత్రమే నిజమైన ప్రజా పార్టీ, ప్రజల భవిష్యత్తు కోసం కష్టపడే పార్టీ,” అని పిలుపునిచ్చారు.
ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళా సంఘ ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాలనీ ప్రజలు మంత్రి గారిని ఘనంగా స్వాగతించి, తమ సమస్యలను వివరించారు. మంత్రి వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. కాంగ్రెస్ పార్టీ గడప గడప ప్రచారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వేగంగా విస్తరిస్తూ, ప్రజల్లో చైతన్యం రేకెత్తిస్తోంది.











Leave a Reply