Navataram

Real news Real time

బలవంతపు వసూళ్ళకు పాల్పడితే చర్యలు తప్పవు!!

ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బబలవంతపు వసూళ్ళకు పాల్పడితే చర్యలు తప్పవు!! చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనర్, ఐపీఎస్ ట్రాన్స్‌జెండర్లను హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని ఆయన హితవు పలికారు.

హైదరాబాద్ అమీర్‌పేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ఆడిటోరియంలో హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రాన్స్‌జెండర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారు సిన్హా, ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ట్రాన్స్‌జెండర్లతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

శాంతి భద్రతలకు భంగం

ఈ సమావేశంలో మాట్లాడిన సీపీ సజ్జనర్… ట్రాన్స్‌జెండర్ల మధ్య గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరాటాలు తరచూ శాంతి భద్రతలకు భంగం కలిగించడమే కాకుండా ప్రాణ నష్టానికి కూడా దారి తీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ట్రాన్స్‌జెండర్లపై ప్రజల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నాయని తెలిపారు. శుభకార్యాల పేరుతో ఇళ్ల వద్దకు వెళ్లి యజమానులను వేధించడం సరికాదని స్పష్టం చేశారు.

“బలవంతపు వసూళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందే. మీపై నమోదయ్యే కేసులు మీ భవిష్యత్తును దెబ్బతీస్తాయి. అమాయక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన శిక్షలు తప్పవు”బలవంతపు వసూళ్ళకు పాల్పడితే చర్యలు తప్పవు!! అని ఆయన హెచ్చరించారు.

ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత

ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీపీ గుర్తు చేశారు. వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఒక సమగ్ర పాలసీని ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లు తెలిపారు. పోలీసు శాఖ ఎల్లప్పుడూ ట్రాన్స్‌జెండర్లకు అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారానికి సహకరిస్తుందని బలవంతపు వసూళ్ళకు పాల్పడితే చర్యలు తప్పవు!! ఆయన భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా అదనపు డీజీపీ చారు సిన్హా మాట్లాడుతూ… ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికే మహిళా భద్రతా విభాగంలో ‘ప్రైడ్ ప్లేస్’ అనే ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా, వేధింపులకు గురైతే నిర్భయంగా ఈ వింగ్‌ను సంప్రదించవచ్చని ఆమె సూచించారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యలను వినేందుకు, పరిష్కరించేందుకు మహిళా భద్రతా విభాగం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి, సమాజంలో హుందాగా జీవించాలని సూచించారు.బలవంతపు వసూళ్ళకు పాల్పడితే చర్యలు తప్పవు!!

హైదరాబాద్ జిల్లా ట్రాన్స్‌జెండర్ సంక్షేమ అదనపు డైరెక్టర్ శ్రీ రాజేందర్ మాట్లాడుతూ… తెలంగాణలో సుమారు 50 వేల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పొందాలంటే ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డులను తప్పనిసరిగా పొందాలని సూచించారు. ట్రాన్స్‌జెండర్లకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.బలవంతపు వసూళ్ళకు పాల్పడితే చర్యలు తప్పవు!!

ఈ సమావేశంలో జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ శ్రీ తఫ్సీర్ ఇకుబాల్ ఐపీఎస్, నార్త్ జోన్ డీసీపీ శ్రీమతి రష్మి పెరుమాళ్ ఐపీఎస్, వెస్ట్ జోన్ డీసీపీ శ్రీ చింతమనేని శ్రీనివాస్, మహిళా భద్రతా విభాగ డీసీపీ శ్రీమతి లావణ్య నాయక్ జాదవ్, సైబరాబాద్ డీసీపీ శ్రీమతి సృజనతో పాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.బలవంతపు వసూళ్ళకు పాల్పడితే చర్యలు తప్పవు!!

Recent Post:-

13వ రోజుకు రైతుబజారు–కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని డిమాండు

How to Lose Lower Belly Fat for Women

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *