Navataram

Real news Real time

గ్రామ అభివృద్ధిలో భాగంగా రాపల్లిలో డ్రైనేజీ పనులు

గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీల్లో ఉన్న డ్రైనేజీలలో చాలా కాలంగా పేరుకుపోయిన మట్టి, చెత్త, మురుగు నీటి అవరోధాలను తొలగించారు. ప్రత్యేకంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీలు పూర్తిగా శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. గతంలో గ్రామ డ్రైనేజీలు మూసుకుపోవడం వల్ల వర్షం పడిన ప్రతీసారి నీరు రోడ్లపై నిలిచిపోవడం, దుర్వాసన వ్యాపించడం, దోమలు విపరీతంగా పెరగడం వంటి సమస్యలు గ్రామ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టినట్లు స్థానికులు తెలిపారు.

ఈ శుభ్రత కార్యక్రమాల వల్ల వర్షాకాలంలో నీటి నిల్వ సమస్య తగ్గి, గ్రామ దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి రోగాల ముప్పు తగ్గుతుందని గ్రామ సర్పంచ్ రామ్‌రెడ్డి తెలిపారు. ప్రజారోగ్యం తమ ప్రథమ ప్రాధాన్యమని, గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రతి వారం శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

గ్రామ కార్యదర్శి సాయిరాం స్వయంగా పరిశీలించారు. గ్రామంలో శాశ్వత పరిష్కారాల కోసం డ్రైనేజీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మిట్టపల్లి రాంరెడ్డి , ఉపసర్పంచ్ సాగర్ , ఏనుగు వంశీ రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Recent Post:-

గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పరిపాలన సాగించాలి

Detox Water: Health Benefits and Myths

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *