Navataram

Real news Real time

ఉచిత గాలి కుంటు వ్యాధి టీకాల కార్యక్రమం ప్రారంభం

హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో బుధవారం ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గేదె జాతికి చెందిన 38 పశువులకు, ఆవు జాతికి చెందిన 56 పశువులకు ఉచితంగా టీకాలు వేశారు.

మండల పశువైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మార్చి 11, 2026 నుండి ఏప్రిల్ 10, 2026 వరకు మండలంలోని అన్ని గ్రామాలలో కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

రైతులు తమ పశువులను గాలి కుంటు వ్యాధి నుంచి రక్షించుకోవడానికి గ్రామాలకు వచ్చే పశువైద్య సిబ్బందితో తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఈసారి పశుపోషకులు టీకాలు వేయించిన తర్వాత భారత్ పశుధన్ యాప్ ద్వారా తమ ఆధార్ నంబర్‌ను ఓటీపీ సహాయంతో వెరిఫై చేసుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల పశు వైద్య అధికారి డా. శాంతి రేఖ, ఎల్.ఎస్.ఏ. సంపత్, పశు వైద్య సహాయకులు అశోక్ పాల్గొన్నారు. గ్రామస్థులు మరియు రైతులు కార్యక్రమానికి సహకరించాలని అధికారులు కోరారు.

Recent post:-

రైతు వేదికలో HT పత్తి సాగుపై అవగాహన శిక్షణ

The Complete Guide to Fiber Enriched Food for a Healthier Life

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *