Navataram

Real news Real time

రెడ్ క్రాస్ సొసైటీ కి ఎంపీ 2 లక్షల విరాళం

ఏలూరు రెడ్ క్రాస్ సంస్థ భవనంలో రెండవ అంతస్తు నిర్మాణ పనులకు గత నెల 28న శంకుస్థాపన చేసిన సందర్భంగా తన తల్లి విజయలక్షి పేరుతోని ట్రస్టు తరపున  రెడ్ క్రాస్ సంస్థకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 2 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. లాభాపేక్ష లేకుండా సమాజానికి సేవ చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీకి అందరూ అండగా నివాల్సిన అవసరం ఉందని చెబుతూ సభా వేదికగా 2 లక్షల విరాళం ప్రకటించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇచ్చిన మాట 10 రోజుల్లోనే నిలబెట్టుకున్నారు.

తాజాగా 2 లక్షల విరాళం చెక్కును ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తరపున ఆయన కార్యాలయ ప్రతినిధులు మంగళవారం రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో ఆ సంస్థ ఏలూరు విభాగం ఛైర్మన్ ఎంబిఎస్వీ ప్రసాద్ కు అందించారు. రోగులకు అవసరమైన రక్త సేకరణలో, ప్రకృతి విపత్తుల సమయంలో రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం ఉదార హృదయం, సేవా భావంతో తమ సంస్థకు 2 లక్షల ఆర్ధిక సహాయం అందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ ఎంబిఎస్వీ ప్రసాద్, వైస్ ఛైర్మన్ సత్యనారాయణరాజు, ట్రెజరర్ బ్రహ్మానందం, సభ్యులు అజయ్ బాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Recent post:-

ఉచిత గాలి కుంటు వ్యాధి టీకాల కార్యక్రమం ప్రారంభం

The Complete Guide to Fiber Enriched Food for a Healthier Life

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *