జలధార – జలహారతి లో భాగంగా ప్రతి గ్రామంలో చెరువు వారీగా ప్రణాళికలను రూపొందించి వెంటనే పంపించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో నున్న చెరువులకు మున్సిపల్ కమీషనర్, దేవస్థానాలకు సంబంధించిన పుష్కరిణి చెరువులకు కూడా దేవస్థానం అధికారులు ప్రణాళికలను రూపొందించాలని తెలిపారు. చెరువుల పనులను అంచనా వేసేటప్పుడు అవసరమైన పనులకు మాత్రమే ప్రతిపాదనలు పెట్టాలని అన్నారు. బుధవారం జలధార- జల హారతి – విజయనగరం చెరువుల వరం అనే బ్యానర్ తో అన్ని మండలాల్లో బుధవారం మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశాలకు నియోజకవర్గం ప్రత్యేకాధికారులు స్థానిక శాసన సభ్యులను ఆహ్వానించాలని, అలాగే నీటి సంఘాల అధ్యక్షులను, ఉపాధ్యక్షులను, MPTC, ZPTC లను ఆహ్వానించి చెరువుల జాబితాలను వారి ముందు పెట్టాలని, ఎందుకు వాటిని ప్రాధాన్యత పనుల్లో పెట్టేమో వారికీ వివరించాలని తెలిపారు.

చెరువుల్లో తీసిన పూడికలను చెరువు గట్ల పటిష్టత కోసం వినియోగించాలని, వచ్చే వర్షాకాలం లో గట్లుకు ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. MPDO లు యాప్ లో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ సహకారం తో ప్రతిపాదిత చెరువులన్నిటిని నిక్షిప్తం చేయాలనీ సూచించారు. పనులు జరగక ముందు జరిగిన తర్వాత భూగర్భ జలాల స్థాయి లను కూడా నమోదు చేయాలనీ, అలాగే చెరువుల పొడవును కూడా నమోదు చేయాలనీ, తద్వారా ఏ స్థాయి లో నీటి స్థాయి మెరుగు పడిందో తెలుస్తుందని అన్నారు. మొదటిగా 215 గ్రామాల్లో ప్రతిపాదించిన 1679 చెరువులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని తెలిపారు. ఇకపై ప్రతి రోజు జలధార పై టెలి కాన్ఫరెన్స్ తీసుకోవడం జరుగుతుందని, డివిజన్ వారీగా సమీక్షించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి పని చేయాలనీ అన్నారు.
Recent Post:-
కుల వివక్ష నిర్మూలనకై బసవేశ్వర చేసిన కృషి చిరస్మరణీయం
The Complete Guide to Fiber Enriched Food for a Healthier Life











Leave a Reply