12వ వేజ్ బోర్డ్ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ (ఏఐటియుసి, ఐఎన్టియుసి, సిఐటియు, హెచ్ఎంఎస్ ) ఆధ్వర్యంలో బుధవారం రోజున శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో ధర్నాను నిర్వహించి యాజమాన్యానికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 11వ వేజ్ బోర్డు కాలపరిమితి ముగిసిన 12వ వేజ్ బోర్డు కమిటీని నేటి వరకు ఏర్పాటు చేయలేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం, యాజమాన్యం నాలుగు లేబర్ కోడ్ల అమల్లో భాగంగా నేటి వరకు 12వ వేజ్ బోర్డు కమిటీ ఏర్పాటు చేయలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం వెంటనే స్పందించి 12వ వేజ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా, కొట్టే కిషన్ రావు, మోత్కూరి కొమురయ్య, రాచర్ల చంద్రమోహన్, నాగభూషణం, బద్రి బుచ్చయ్య, ఫిట్ కార్యదర్శిలు దాడి రాజయ్య, మురళి చౌదరి, మోతే లచ్చన్న, మారపల్లి సారయ్య, ఆకుల లక్ష్మణ్, గునిగంటి నర్సింగ్ రావు, ఐఎన్టీయూసీ నాయకులు శీలం చిన్నయ్య, జగన్, శ్రీధర్, గోపాల్ రెడ్డి, నంబయ్య, అశోక్, సిఐటియు నాయకులు సుధాకర్, సందీప్, హెచ్ ఎం ఎస్ నాయకులు శశిధర్, ప్రసాద్, సురేందర్ పాల్గొన్నారు.
Recent Post:-











Leave a Reply