Navataram

Real news Real time

గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు ఆచరణీయం

మంచిర్యాల:

జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు.

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి పి. చంద్రయ్య పాల్గొన్నారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పి. చంద్రయ్య మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య సాధనలో మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. సత్యం, అహింస, శాంతి, సత్యాగ్రహం వంటి సిద్ధాంతాలను ఆయుధాలుగా చేసుకొని స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపారని తెలిపారు.

గాంధీజీ చూపిన అహింసా మార్గం, సత్యనిష్ఠ, నిరాడంబర జీవనం, దేశసేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమని చంద్రయ్య పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని సూచించారు.

Also Read:- యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న రైతులు

సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా ప్రజాసేవలో నిజాయితీ, బాధ్యత, పారదర్శకత వంటి విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

మహాత్మా గాంధీ కలలు కన్న స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. గాంధీజీ సిద్ధాంతాలను స్మరించుకోవడమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

Recent post :

Eye Health: Why It Matters More Than Ever

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *